ఇద్దరూ టీచర్లే | NTR Trainer Lloyd Stevens Learnt Flying Kites | Sakshi
Sakshi News home page

ఇద్దరూ టీచర్లే

Jan 17 2018 1:21 AM | Updated on Jan 17 2018 1:21 AM

NTR Trainer Lloyd Stevens Learnt Flying Kites - Sakshi

‘ఇలా చేస్తే ఈజీగా తగ్గొచ్చు’... ఎన్టీఆర్‌కి సలహా ఇస్తున్నారు లాయిడ్‌ స్టీవెన్స్, ‘ఇలా చేస్తే ఈజీగా గాలిపటం ఎగరేయొచ్చు’... స్టీవెన్స్‌కి సలహా ఇచ్చారు ఎన్టీఆర్‌. బాగుంది.. తగ్గే విషయంలో ఎన్టీఆర్‌కి స్టీవెన్స్‌ గురువు అయితే.. గాలిపటాలు ఎగరేసే విషయంలో స్టీవెన్స్‌కి గురువు అయ్యారు ఎన్టీఆర్‌. ఇంతకీ ఏంటి కహానీ అంటే... ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్‌ త్వరలో ఆరంభం కానుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొత్త లుక్‌లో కనిపిస్తారు. అందుకే హాలీవుడ్‌ నుంచి లాయిడ్‌ స్టీవెన్స్‌ ఇండియా వచ్చారు. దగ్గరుండి ఎన్టీఆర్‌కి ఫిజికల్‌ ట్రైనింగ్‌ చేయిస్తున్నారు. సంక్రాంతి పండగకి మాత్రం ఎన్టీఆర్‌ దగ్గరుండి స్టీవెన్స్‌ చేత గాలిపటాలు ఎగరేయించారు. ‘‘గాలి పటాలు ఎలా ఎగరేయాలో ఎన్టీఆర్‌ నేర్పించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని విదేశీ ట్రైనర్‌ లాయిడ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement