బాలయ్య, చిరులకు ఎన్టీఆర్‌ చాలెంజ్ | NTR Nominate Balakrishna And Chiranjeevi For Be The Real Man Challenge | Sakshi
Sakshi News home page

బాలయ్య, చిరులకు ఎన్టీఆర్‌ చాలెంజ్

Apr 21 2020 10:36 AM | Updated on Apr 21 2020 11:02 AM

NTR Nominate Balakrishna And Chiranjeevi For Be The Real Man Challenge - Sakshi

ప్రముఖ దర్శకుడు రాజమౌళి విసిరిన ‘బీ ది రియల్‌ మ్యాన్‌’  చాలెంజ్‌ను హీరో ఎన్టీఆర్‌ పూర్తి చేశారు. ఇంటి పనుల్లో భార్యకు సాయం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను తారక్‌.. ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇది జక్కన్న కోసం అని పేర్కొన్నారు. మన ఇంట్లో ప్రేమలు, అప్యాయతలే కాదు.. పనులను కూడా పంచుకుందామని పిలుపునిచ్చారు. మనం చేసిన పనులను ఇతరులతో షేర్‌ చేయడం చాలా ఫన్‌గా ఉంటుందన్నారు.

అలాగే ఈ చాలెంజ్‌కు తన బాబాయ్‌ బాలకృష్ణ, మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్‌ నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌, ప్రముఖ దర్శకుడు కొరటాల శివను నామినేట్‌ చేశారు. ఎన్టీఆర్ ఇంటి పనులు చేయడమే కాకుండా టాలీవుడ్‌లో ప్రముఖులకు కూడా సవాలు విసరడంతో టాలీవుడ్‌లో బీ ది రియల్‌ మ్యాన్‌ చాలెంజ్‌ ట్రేండ్‌ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. 

లాక్‌డౌన్‌ వేళ ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయాలని అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌ వంగ.. సరికొత్త చాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గిన్నెలు శుభ్రం చేయడం, ఇల్లు తుడవడం వంటి ఇంటి పనులు చేస్తున్న వీడియోను ట్వీటర్‌లో  షేర్‌ చేసి  ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ అని ఛాలెంజ్‌ విసిరారు.ఈ చాలెంజ్‌కు రాజమౌళిని నామినేట్‌ చేశారు. దీంతో చాలెంజ్‌ పూర్తి చేసిన వీడియోను షేర్‌ చేసిన రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్‌ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, ‘బాహుబలి’ నిర్మాత శోభు, దర్శకుడు సుకుమార్‌లను ఈ చాలెంజ్‌కు నామినేట్‌ చేశారు.

చదవండి : రియల్‌ మ్యాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement