ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా..? | NTR Movie with Chandra sekhar Yeleti | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా..?

Aug 16 2017 12:51 PM | Updated on Sep 17 2017 5:35 PM

ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా..?

ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా..?

ఒకప్పుడు మూస సినిమాలతో బోర్ కొట్టించిన ఎన్టీఆర్ ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తున్నాడు.

ఒకప్పుడు మూస సినిమాలతో బోర్ కొట్టించిన ఎన్టీఆర్ ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న యంగ్ టైగర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు జూనియర్.

రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లలో ఒకరితో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఉంటుందన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. అయితే అందరికీ షాక్ ఇస్తూ మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమర్షియల్ గా ప్రూవ్ చేసుకోలేకపోయిన చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందట.

ఇటీవల మనమంతా సినిమాతో ఆకట్టుకున్న చంద్రశేఖర్ చెప్పిన లైన్ ఎన్టీఆర్ కు నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేని చంద్రశేఖర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ లాంటి కమర్షియల్ హీరో నటిస్తాడా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement