బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్ | NTR Beats Baahubali with Janatha Garage In Mollywood | Sakshi
Sakshi News home page

బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్

Feb 16 2016 3:06 PM | Updated on Sep 3 2017 5:46 PM

బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్

బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. టెంపర్ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన జూనియర్ నాన్నకు ప్రేమతో సినిమాతో ఓవర్ సీస్‌లోనూ సత్తా చాటాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్లో ఉన్నాడు. టెంపర్ సక్సెస్తో తిరిగి ఫాంలోకి వచ్చిన జూనియర్.. నాన్నకు ప్రేమతో సినిమాతో ఓవర్ సీస్లోనూ సత్తా చాటాడు. ఇప్పుడు అదే ఫాంలో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాగా చెబుతున్న బాహుబలి పేరిట ఉన్న మళయాల రైట్స్ రికార్డ్ను ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు.

బాహుబలి సినిమా మళయాల రైట్స్ను 3.8 కోట్లకు సొంతం చేసుకున్నారు అక్కడి ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఆ రికార్డును చెరిపేస్తూ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా జనతా గ్యారేజ్ రైట్స్ను ఏకంగా 4.5 కోట్లకు తీసుకున్నారు. అయితే ఇంత భారీ మొత్తానికి తీసుకోవటం వెనుక మరో కారణం కూడా ఉంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్లో మళయాల సూపర్స్టార్ మోహన్లాల్ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు యువ కథానాయకుడు ముకుందన్ విలన్గా నటించటం, నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమాకు మాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో భారీ మొత్తానికి జనతా గ్యారేజ్ రైట్స్ను తీసుకోవడానికి నిర్మాతలు అంగీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement