ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఫిక్స్..? | NTR And Vakkantham Vamsi Movie Title Dhadkan | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఫిక్స్..?

Aug 28 2016 10:33 AM | Updated on Sep 4 2017 11:19 AM

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఫిక్స్..?

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఫిక్స్..?

వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న...

వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతోంది. కొరటాల శివ డైరెక్షన్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించటం లాంటి అంశాలతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

జనతా గ్యారేజ్ రిలీజ్కు ముందే తన నెక్ట్స్ సినిమాను కూడా ఫైనల్ చేసిన జూనియర్, ఆ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం తన నెక్ట్స్ సినిమాను వక్కంతం వంశీ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు జూనియర్. ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్నాడు.

ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాకు ధడ్కన్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారట. ఎన్టీఆర్ మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేసే పనిలో ఉన్నాడు వక్కంతం వంశీ. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement