అలా అనుకుంటే.. అమాయకత్వమే! | Not every film is for everyone: Anushka on A-certificate for NH10 | Sakshi
Sakshi News home page

అలా అనుకుంటే.. అమాయకత్వమే!

Feb 26 2015 11:23 PM | Updated on Sep 2 2017 9:58 PM

అలా అనుకుంటే.. అమాయకత్వమే!

అలా అనుకుంటే.. అమాయకత్వమే!

నమ్మకం, భయం, ఉద్వేగం.. ప్రస్తుతం ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో ఉన్నారు అనుష్క శర్మ. దానికి కారణం తొలి ప్రయత్నంగా

నమ్మకం, భయం, ఉద్వేగం.. ప్రస్తుతం ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో ఉన్నారు అనుష్క శర్మ. దానికి కారణం తొలి ప్రయత్నంగా ఆమె నిర్మించిన ‘ఎన్‌హెచ్ 10’ చిత్రం. కథానాయికగా ఇప్పటివరకూ అనుష్క కెరీర్ బాగానే సాగింది. ఇక, నిర్మాతగా ఎలాంటి అనుభూతి మిగులుతుందో ‘ఎన్‌హెచ్ 10’ విడుదల రోజున తెలిసిపోతుంది. వచ్చే నెల 13న విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇది ముందే ఊహించాననీ, అన్ని చిత్రాలూ ఆరు నుంచి అరవయ్యేళ్లవారు చూసే విధంగా ఉండవనీ ఈ సందర్భంగా అనుష్క పేర్కొన్నారు.
 
 ఆమె ఇంకా మాట్లాడుతూ - ‘‘ ‘నీకేంటి నువ్వు స్టార్ హీరోయిన్‌వి.. నువ్వు నిర్మించిన సినిమా బంపర్ హిట్’ అని నా స్నేహితులు కొంతమంది అంటున్నారు. నేనా మాటలతో ఏకీభవించను. ‘స్టార్’ హోదా అనేది ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడం వరకే ఉపయోగపడుతుంది. ఆ హోదా వల్లే సినిమా ఆడేస్తుందనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరోటి ఉండదు. సినిమాలో దమ్ముంటేనే హిట్ అవుతుంది. లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా ఫట్టే. నేను నిర్మించిన ‘ఎన్‌హెచ్ 10’ మంచి దమ్మున్న కథ. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అందుకే, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. మరి.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement