దిశా పోయె సారా వచ్చె!

Not Disha Patani, Sara Ali Khan to romance Tiger Shroff in Baaghi 3  - Sakshi

మనదని రాసి పెట్టి ఉంటే కాస్త ఆలస్యమైనా మనకు రాక మానదు. ప్రస్తుతం ఇది బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌కు సరిపోయేలా ఉంది. ఈ నెలలో రిలీజైన ‘కేదార్‌నాథ్‌’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు సారా. కానీ అన్నీ సవ్యంగా జరిగి ఉంటే  టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2’ చిత్రంతో ఆమె ఎంట్రీ జరగాల్సింది. టైగర్‌ ష్రాఫ్‌తో నటించే చాన్స్‌ సారాకు మిస్‌ అయ్యింది. ఆ తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌ ‘సింబా’ సినిమాలో కూడా నటించేశారు సారా. ఇప్పుడు టైగర్‌ ష్రాఫ్‌ సరసన ‘భాగీ 3’ చిత్రంలో సారాకి చాన్స్‌ దక్కిందని బాలీవుడ్‌ సమాచారం.

‘భాగీ 1, భాగీ 2’ చిత్రాల్లో టైగర్‌ ష్రాఫ్‌ హీరో అన్న విషయం తెలిసిందే. అంతా బాగానే ఉంది కానీ ‘భాగీ 2’ లో నటించిన దిశా పాట్నీనే ‘భాగీ 3’లో కూడా నటిస్తారని అప్పుడు వార్తలు వచ్చాయి. ౖపైగా టైగర్, దిశా లవ్‌లో ఉన్నారని టాక్‌ ఉంది. మరి ఇప్పుడు ‘భాగీ 3’ చిత్రం కోసం సడన్‌గా సారా ఎందుకు లైన్లోకొచ్చారు? అనేది బాలీవుడ్‌లో జరుగుతున్న చర్చ. ఈ సంగతి ఇలా ఉంచితే.. సారా నటించిన ‘సింబా’ చిత్రం ఈ నెల 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top