నా బయోపిక్ ఎవరూ తీయరు : సల్మాన్ ఖాన్ | No One Will Make Biopic On My Boring Life : salman Khan | Sakshi
Sakshi News home page

నా బయోపిక్ ఎవరూ తీయరు : సల్మాన్ ఖాన్

Jul 16 2016 6:49 PM | Updated on Sep 4 2017 5:01 AM

నా బయోపిక్ ఎవరూ తీయరు : సల్మాన్ ఖాన్

నా బయోపిక్ ఎవరూ తీయరు : సల్మాన్ ఖాన్

సుల్తాన్ సినిమాతో ఈద్ బాద్షాగా మరోసారి ప్రూవ్ చేసుకున్న సల్మాన్ ఖాన్ భారీ వసూళ్లతో బాక్సాఫీస్కు కొత్త టార్గెట్లు సెట్ చేస్తున్నాడు. వరుస వంద కోట్ల సినిమాలతో బాలీవుడ్ టాప్ స్టార్గా ఎదిగిన సల్లూ భాయ్, సుల్తాన్ ప్రమోషన్...

సుల్తాన్ సినిమాతో ఈద్ బాద్షాగా మరోసారి ప్రూవ్ చేసుకున్న సల్మాన్ ఖాన్ భారీ వసూళ్లతో బాక్సాఫీస్కు కొత్త టార్గెట్లు సెట్ చేస్తున్నాడు. వరుస వంద కోట్ల సినిమాలతో బాలీవుడ్ టాప్ స్టార్గా ఎదిగిన సల్లూ భాయ్, సుల్తాన్ ప్రమోషన్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ల సీజన్ నడుస్తుండటంతో ఓ మీడియా ప్రతినిధి మీ జీవిత కథతో సినిమా చేసే ఆలోచన ఉందా అంటూ ప్రశ్నించారు. దానికి సమాధానంగా 'నాది చాలా బోరింగ్ లైఫ్. ఇలాంటి బోరింగ్ లైఫ్ మీద సినిమా చేయాలని ఎవరూ అనుకోరు' అంటూ కామెంట్ చేశాడు.

ఇతర దర్శక నిర్మాతలు అలాంటి ఆలోచనలో మీమ్మల్ని సంప్రదిస్తే అన్న ప్రశ్నకు బదులిస్తూ.. 'నా జీవితంపై సినిమా తీస్తా అని ఎవరు ముందుకు వచ్చినా నేను అంగకీరించను.. ఎందుకంటే నా కథను రాయాలంటే నేనే రాయాలి. లేదా.. నా తమ్ములు, చెల్లెలు రాయాలి. అన్ని విషయాలు తెలియని వారు కథ తయారుచేయటం సాధ్యం కాద'న్నారు. అంతేకాదు వెండితెర మీద సల్మాన్ పాత్రలో నటించేందుకు ప్రస్తుతం ఉన్న నటులెవ్వరు సూటవ్వరని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement