హత్య చేసిందెవరు?

జాతీయ బాడీ బిల్డర్ బల్వాన్ హీరోగా ప్రాచి అధికారి, మౌనిక హీరోయిన్లుగా ఎస్‌ఎంఎం ఖాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నైజాం పిల్లోడు’. రెహాన బేగం నిర్మిస్తున్న ఈ సినిమా ఒక్కపాట మినహా పూర్తి అయింది. మార్చి 29న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎస్‌ఎంఎం ఖాజా మాట్లాడుతూ– ‘‘45 సినిమాల్లో సోలో ఫైటర్‌గా చేసిన బల్వాన్ ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా రూపొందించాం’’ అన్నారు. ‘‘మా సినిమా ద్వారా సంగీత దర్శకుడు మజ్నుని పరిచయం చేస్తున్నాం. మా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని రెహాన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, సంగీతం: ఎస్ కే. మజ్ను.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి