క్రైమ్‌ పార్ట్‌నర్‌

Nivetha Thomas, Akhil team up for a crime thriller - Sakshi

ఓ నేరస్తుడ్ని పట్టుకోవడానికి అఖిల్‌ వేయనున్న ప్లాన్‌కు హెల్ప్‌ చేయడానికి రెడీ అవుతున్నారట నివేదా థామస్‌. ‘అ!, కల్కి’ చిత్రాల ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా నివేథా ధామస్‌ పేరును చిత్రబృందం పరిశీలిస్తోందని తెలిసింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నారు అఖిల్‌. ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌ వర్మతో చేయనున్న సినిమా ఆరంభం అవుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top