జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్న నితిన్‌ | Nitin And Keerthy Suresh Rang De Movie Starts | Sakshi
Sakshi News home page

జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్న నితిన్‌

Jun 24 2019 10:52 AM | Updated on Jun 24 2019 10:52 AM

Nitin And Keerthy Suresh Rang De Movie Starts - Sakshi

ఓ వైపు భీష్మ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.. నిన్ననే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశాడు.. నేడు మరో చిత్రాన్ని అనౌన్స్‌ చేసేశాడు హీరో నితిన్‌. వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం కీర్తి సురేష్‌తో జోడి కట్టనున్నాడు. తాజాగా ఈ కొత్త చిత్ర విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు.

వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించగా.. చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్షన్‌లో మరో సినిమాను ఆదివారం ప్రారంభించాడు నితిన్‌. తాజాగా వెంకీ అట్లూరితో కలిసి చేయబోయే కొత్త సినిమా కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించనుందని, ఈ సినిమాకు రంగ్‌దే అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు తెలిపాడు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా.. సినిమాటోగ్రఫర్‌గా పీసీ శ్రీరామ్‌ పనిచేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement