సీక్వెల్‌ షురూ | Nikhil-starrer Karthikeya 2 to go on floors in June | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌ షురూ

Jun 1 2019 3:10 AM | Updated on Jun 1 2019 3:10 AM

Nikhil-starrer Karthikeya 2 to go on floors in June - Sakshi

నిఖిల్‌

నిఖిల్‌ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ’. 2014లో విడుదలైన ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. అప్పట్లోనే ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం (జూన్‌ 1) నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కార్తికేయ –2’ చిత్రాన్ని అధికారికంగా వెల్లడించారు టీమ్‌. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల ‘కార్తికేయ 2’ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ– ‘‘కార్తికేయ –2’ చిత్రంపై అంచనాలు ఉంటాయని తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉంటుంది. ఈ చిత్రం ‘కార్తికేయ’ కు కొనసాగింపుగా ఉంటూనే కథ, కథనాల పరంగా కొత్తగా ఉంటుంది. పర్‌ఫెక్ట్‌ సీక్వెల్‌ అని చెప్పొచ్చు. నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం అవుతాయి’’ అని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement