ఐ లవ్‌ నిక్కీ! | Nidhhi Agerwal chatting with netizens | Sakshi
Sakshi News home page

ఐ లవ్‌ నిక్కీ!

Jan 6 2019 3:20 AM | Updated on Jul 14 2019 10:21 AM

Nidhhi Agerwal chatting with netizens - Sakshi

నిధీ అగర్వాల్‌

నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరోయిన్‌ నిధీ అగర్వాల్‌. తెలుగు ఆడియన్స్‌ గురించి తన అభిప్రాయాన్ని, కొత్త ఏడాది తీసుకున్న నిర్ణయాలు.. ఇంకా కొన్ని విషయాలను నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారామె. ప్రస్తుతం అఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు నిధీ అగర్వాల్‌. ఈ నెల 25న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ బ్యూటీ చెప్పిన విషయాలు తెలుసుకుందాం.

► తెలుగు ప్రేక్షకుల గురించి మీ అభిప్రాయం?
అద్భుతమైన, నమ్మకమైనవారు.

► కొత్త ఏడాది తీసుకున్న నిర్ణయం?
భయం లేకుండా ఉండటం.

► ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాలో మీ క్యారెక్టర్‌ గురించి?
మై మోస్ట్‌ ఫేవరెట్‌ క్యారెక్టర్‌. ఐ లవ్‌ యు నిక్కీ (సినిమాలో నిధి పాత్ర పేరు నిక్కీ). ఈ సినిమా రిలీజ్‌ కోసం చాలా ఎగై్జటెడ్‌గా ఎదురు చూస్తున్నా. ప్రేక్షకులు సపోర్ట్‌ చేయాలి.

► మీకు బిర్యానీ అంటే ఇష్టమేనా?
చాలా ఇష్టం.

► మీ ఫేవరెట్‌ నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌?
ప్రస్తుతం ‘వైల్డ్‌ వైల్డ్‌ కంట్రీ’ చూస్తున్నాను.

► మీ రోల్‌ మోడల్‌ ఎవరు?
ఈ రోజు ఆమె పుట్టినరోజు (శనివారం బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ పుట్టినరోజని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు)

► ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూశారా?
ఇప్పటివరకు నాలుగుసార్లు చూశాను.

► అఖిల్‌ లేదా నాగచైతన్య.. ఎవరిష్టం?
ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు (నవ్వుతూ)

► ‘మిస్టర్‌ మజ్ను’ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి గురించి?
మై ఫేవరెట్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌.

► సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌లో ఎవరిపై అయినా మీకు క్రష్‌ ఉందా?
అవును. ఉంది కానీ ఎవరో చెప్పను.

► ఫైనల్లీ మీ గోల్‌ ఏంటి?
నా పూర్తి బలాన్ని ఉపయోగించి నేను ఆశించిన శిఖరాలకు చేరుకోవాలి. భవిష్యత్‌ బాగా ఉండటానికి కావాల్సిన కృషి చేసేంత ఎనర్జీ నాలో దాగి ఉందని నా నమ్మకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement