గౌతమ్‌కార్తీక్‌తో నిక్కీ రెడీ | Nicky ready with Gautham Karthik | Sakshi
Sakshi News home page

గౌతమ్‌కార్తీక్‌తో నిక్కీ రెడీ

Nov 8 2016 3:45 AM | Updated on Sep 4 2017 7:28 PM

గౌతమ్‌కార్తీక్‌తో నిక్కీ రెడీ

గౌతమ్‌కార్తీక్‌తో నిక్కీ రెడీ

యువ నటుడు గౌతమ్‌కార్తీక్‌తో జత కట్టడానికి నటి నిక్కీగల్రాణి రెడీ అవుతున్నారు.

యువ నటుడు గౌతమ్‌కార్తీక్‌తో జత కట్టడానికి నటి నిక్కీగల్రాణి రెడీ అవుతున్నారు. ఈ డార్లింగ్ నాయకి నటించి తెరపైకి వచ్చిన చివరి చిత్రం వేలైన్ను వందుట్టా వెళ్లక్కారన్. అయితే లారెన్‌‌సతో నటిస్తున్న మొట్టశివ కెట్టశివ, జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా ఒక చిత్రం అంటూ నిక్కీగల్రాణి బిజీగా ఉన్నారు. తాజాగా గౌతమ్‌కార్తీక్‌కు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని తంగం సినిమాస్ పతాకంపై ఎం.తంగరాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సంతోష్ పీటర్ జయకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

దీనికి హరహర మహాదేవకి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో ఇతర పాత్రల్లో సతీశ్, మొటై రాజేంద్రన్, రవిమరియ, నమో నారాయణన్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.ఈ చిత్రానికి పాల్-మురళిబాలు ద్వయం సంగీతాన్ని, సెల్వకుమార్ చాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆదివారం ప్రారంభమైంది. చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 23 నుంచి చెన్నైలో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ చిత్ర విడుదల హక్కుల్ని స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా పొందడం విశేషం. ప్రస్తుతం ఈయన సూర్య హీరోగా సీ-3(ఎస్-3) చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న సీ-3 చిత్ర టీజర్‌ను డిసెంబర్ 16న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.అదే విధంగా సూర్య కథానాయకుడిగా విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో తానాసేర్న్‌ద కూటం చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement