ప్రేమలీల ఒకరిది పెళ్లి గోల మరొకరిది | new movie premalela - pelligola | Sakshi
Sakshi News home page

ప్రేమలీల ఒకరిది పెళ్లి గోల మరొకరిది

Mar 23 2017 11:42 PM | Updated on Sep 5 2017 6:54 AM

ప్రేమలీల ఒకరిది పెళ్లి గోల మరొకరిది

ప్రేమలీల ఒకరిది పెళ్లి గోల మరొకరిది

రెండు దశాబ్దాలకు పైగా రాయలసీమలో 400 సినిమాలు పంపిణీ చేసిన శ్రీ మహావీర్‌ ఫిలిమ్స్‌ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.

రెండు దశాబ్దాలకు పైగా రాయలసీమలో 400  సినిమాలు పంపిణీ చేసిన శ్రీ మహావీర్‌ ఫిలిమ్స్‌ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. విష్ణు విశాల్, నిక్కీ గల్రానీ జంటగా ఎళిల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వెల్లై కారన్‌’ అనే తమిళ చిత్రాన్ని ‘ప్రేమలీల–పెళ్ళి గోల’ పేరుతో మహావీర్‌ ఫిలిమ్స్‌ అధినేత పారస్‌ జైన్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. సత్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను డైరెక్టర్‌ వీవీ వినాయక్, నిర్మాత ఆర్‌.బి. చౌదరి విడుదల చేశారు. ఆర్‌. బి.చౌదరి మాట్లాడుతూ– ‘‘విష్ణు విశాల్‌కు తమిళ్‌లో హీరోగా మంచి గుర్తింపు ఉంది. అతని టైమింగ్, నటన బాగుంటుంది. హిలేరియస్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘పారస్‌ జైన్‌ ఎన్నో మంచి సినిమాలు పంపిణీ చేశారు.

మంచి కంటెంట్‌ ఉన్న ‘ప్రేమలీల పెళ్లిగోల’ ఘనవిజయం సాధించాలి’’ అని వీవీ వినాయక్‌ అన్నారు. పారస్‌ జైన్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేమలీల ఒకరిది. పెళ్ళి గోల మరొకరిది. అదే ఈ సినిమా. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ కోసం చాలామంది పోటీపడ్డా, నా మీద నమ్మకంతో విష్ణు విశాల్‌ నాకు ఇప్పించారు. ముందు రీమేక్‌ చేద్దామనుకున్నాం. కానీ, కామెడీ మిస్‌ అవుతుందని విష్ణు విశాల్‌ చెప్పడంతో డబ్బింగ్‌ చేసి, రిలీజ్‌ చేస్తున్నాం. ఈ వేసవిలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement