సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా యాక్షన్ డ్రామా | new action drama movie with siddarth and lakshmi menon | Sakshi
Sakshi News home page

సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా యాక్షన్ డ్రామా

Jan 11 2014 3:30 PM | Updated on Sep 2 2017 2:31 AM

సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా యాక్షన్ డ్రామా

సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా యాక్షన్ డ్రామా

'పిజ్జా'తో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'జిగర్తండా'.

'పిజ్జా'తో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'జిగర్తండా'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధార్ధ్, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్నారు. ఎస్.కె. పిక్చర్స్, వి.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్నితెలుగులో అందిస్తున్నాయి. ఒక షెడ్యూల్ మినహా ఈ చిత్రం పూర్తయ్యింది.

తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సిద్ధార్ధ్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.ఎస్. రామిరెడ్డి చెప్పారు. 'తొలి చిత్రం 'పిజ్జా'తో కార్తీక్ సుబ్బరాజ్ మంచి దర్శకునిగా నిరూపించుకున్నారని, మలి ప్రయత్నంగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సురేష్ కొండేటి తెలిపారు. వేసవి కానుకగా విడుదల చేయబోతున్న ఈ చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు.

బాబీ సింహా, కరుణ, గురు సోమసుందరం, ప్రతాప్ పోతన్, సౌందర రాజా, వినోధిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: గేవ్ మిక్ యు యారీ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్.

Advertisement
 
Advertisement
Advertisement