అతీంద్రియ శక్తులతో... | Neelakanta's 'Maya' first look released | Sakshi
Sakshi News home page

అతీంద్రియ శక్తులతో...

May 11 2014 10:46 PM | Updated on Sep 2 2017 7:14 AM

అతీంద్రియ శక్తులతో...

అతీంద్రియ శక్తులతో...

మనుషుల్లో ఉండే అతీంద్రియ శక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాయ’. నీలకంఠ దర్శకుడు. హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు.

 మనుషుల్లో ఉండే అతీంద్రియ శక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాయ’. నీలకంఠ దర్శకుడు. హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఎంవీకే రెడ్డి, మధురా శ్రీధర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నీలకంఠ మాట్లాడుతూ- ‘‘ఇది నా కలల చిత్రం. వైవిధ్యమైన కథనంతో సాగే థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. కథ, కథనాలు కొత్త అనుభూతికి లోను చేస్తాయి. కొత్త దనాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘నీలకంఠ సినీ వ్యవసాయదారుడు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. తెలుగు సినీచరిత్రలోనే ‘యామ’ బెస్ట్ థ్రిల్లర్. సాంకేతికంగా అద్భుతం ఈ సినిమా. మేలో పాటలను, జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని మధుర శ్రీధర్ తెలిపారు. ఇంకా చిత్ర తారాగణంతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, కె.ఎల్.దామోదరప్రసాద్ కూడా మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement