ఆన్‌ స్క్రీన్‌.. ఆన్‌ సెట్స్‌

Nayanthara joins the sets of Sivakarthikeyan's next - Sakshi

ఏడాది తిరగక ముందే తమిళ హీరో శివకార్తీకేయన్‌తో హీరోయిన్‌ నయనతార మళ్లీ జోడీ కట్టారు. గతేడాది ‘వేలైక్కారన్‌’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజేష్‌ దర్వకత్వంలో ఈ జంట నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తోంది. రాధిక, సతీష్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా మొదలైన 25 రోజుల తర్వాత సెట్‌లో జాయిన్‌ అయ్యారు నయనతార. యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ రేపు స్క్రీన్‌కి రానుంది. అలాగే శివ కార్తీకేయన్‌ నెక్ట్స్‌ రిలీజ్‌ ‘సీమరాజా’. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top