రాకుమారుడిలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి! | navin chandra new movie na rakumarudu ! | Sakshi
Sakshi News home page

రాకుమారుడిలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి!

Feb 19 2014 11:11 PM | Updated on Oct 30 2018 5:58 PM

రాకుమారుడిలాంటి  బాయ్‌ఫ్రెండ్ కావాలి! - Sakshi

రాకుమారుడిలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి!

‘‘నాకు చదువు అంటే పెద్ద ఆసక్తి లేదు. అయితే అల్లరి మాత్రం చాలా బాగా చేస్తాను. నాకు రాకుమారుడులాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలని ఉంది.


 ‘‘నాకు చదువు అంటే పెద్ద ఆసక్తి లేదు. అయితే అల్లరి మాత్రం చాలా బాగా చేస్తాను. నాకు రాకుమారుడులాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలని ఉంది. అయ్యో... ఇదంతా నా పర్సనల్ అనుకునేరు. ‘నా రాకుమారుడు’ సినిమాలో నేను పోషించిన బిందు పాత్ర తీరు తెన్నులివి’’ అని నవ్వుతూ చెప్పారు రీతూవర్మ. నవీన్‌చంద్ర, రీతూవర్మ జంటగా సత్య దర్శకత్వంలో హరివిల్లు క్రియేషన్స్ పతాకంపై వజ్రంగ్ నిర్మించిన ‘నా రాకుమారుడు’ రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రీతూవర్మ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘నేను పుట్టింది నార్త్‌లో. పెరిగింది... చదివింది హైదరాబాద్‌లో.
 
 ‘అనుకోకుండా’ అనే లఘు చిత్రంలో తొలుత నటించాను. ఆ తర్వాత ‘బాద్‌షా’లో కాజల్ అగర్వాల్ చెల్లెలుగా యాక్ట్ చేశాను. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో నా పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ‘నా రాకుమారుడు’ నాకు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. అందుకే విడుదలయ్యే వరకూ కొత్త సినిమాలు కమిట్ కావడం లేదు. దర్శకుడు సత్య నా పాత్రను బాగా డిజైన్ చేశాడు’’ అని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement