నాని చేతుల మీదుగా ‘కురుక్షేత్రం’... | Nani Releasing Arjun Kurukshetram Movie Trailer On 27th June | Sakshi
Sakshi News home page

Jun 26 2018 3:34 PM | Updated on Jun 26 2018 3:41 PM

Nani Releasing Arjun Kurukshetram Movie Trailer On 27th June - Sakshi

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ 150వ చిత్రంగా తెరకెక్కుతున్న యాక్షన్‌ మూవీ కురుక్షేత్రం. అర్జున్‌ సోలో హీరోగా సక్సెస్‌ చూసి చాలా కాలమైంది. ప్రస్తుతం ఎక్కువగా సహాయ పాత్రలు చేస్తున్న అర్జున్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా విలన్‌గా బిజీగా ఉన్నారు. మళ్లీ సోలో హీరోగా ట్రై చేస్తోన్న చిత్రం కురుక్షేత్రం. 

ఇటీవల అభిమన్యుడు సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేసి ప్రశంసలు అందుకున్నారు అర్జున్‌. ఈ సినిమా సక్సెస్‌లో అర్జున్‌ నటన ముఖ్య పాత్ర పోషించింది. అర్జున్‌ హీరోగా నటిస్తోన్న కురుక్షేత్రం సినిమా ట్రైలర్‌ను రేపు (జూన్‌ 27) సాయంత్రం నేచురల్‌ స్టార్‌ నాని చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement