‘ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న’

Nagarjuna Emotional Tweet About 4 Years Of Manam - Sakshi

అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన మనం సినిమా రిలీజ్‌ అయి నేటికి నాలుగేళ్లు. అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించిన ఈ సినిమా, దివంగత నటుడు నాగేశ్వరర్రావు చివరి సినిమా కావటం విశేషం. ఆరోగ్యం సహకరించకపోయినా.. చివరి క్షణం వరకు నటిస్తూనే ఉం‍డాలన్న కోరికతో ఈ సినిమాను పూర్తి చేశారు ఏఎన్నార్‌.

మనం సినిమా రిలీజ్‌ అయి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నాగార్జున ట్వీట్‌ చేశారు. ‘మనం సినిమా రిలీజ్‌ అయి నాలుగేళ్లు. నేనెప్పుడూ అదే ఆలోచిస్తుంటా.. మీరు మమ్మల్ని ఏడిపించి, నవ్వించి జీవితాన్ని చావును ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చారు. మేం ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న’ అంటూ ట్వీట్‌ చేశారు నాగ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top