ఆ కుర్చీ ఖరీదు 25 లక్షలు | Nagarjuna Chair in Oopiri Costs 25 Lakhs | Sakshi
Sakshi News home page

ఆ కుర్చీ ఖరీదు 25 లక్షలు

Mar 22 2016 11:23 AM | Updated on Jul 15 2019 9:21 PM

ఆ కుర్చీ ఖరీదు 25 లక్షలు - Sakshi

ఆ కుర్చీ ఖరీదు 25 లక్షలు

ప్రయోగాలకు పట్టం కడుతూ వరుస విజయాలు సాధిస్తున్న టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున, ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మరో ఎక్స్పరిమెంటల్ మూవీ ఊపిరి.

ప్రయోగాలకు పట్టం కడుతూ వరుస విజయాలు సాధిస్తున్న టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున, ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మరో ఎక్స్పరిమెంటల్ మూవీ ఊపిరి. ఫ్రెంచ్ సినిమా ద ఇంటచబుల్స్కు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాలో కేవలం వీల్ చైర్కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు నాగ్. దీంతో ఈ సినిమాలో నాగ్ కూర్చునే వీల్ చైర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు చిత్రయూనిట్.

దాదాపు 25 లక్షల రూపాయల ఖర్చుతో ఈ చైర్ను ప్రత్యేకంగా తయారు చేయించారు. ద ఇంటచబుల్స్ సినిమాకు చైర్ తయారు చేసిన స్వీడన్ కంపెనీనే ఈ సినిమా కోసం కూడా, నాగ్ కొలతలను తీసుకొని చైర్ రూపొందించారు. సినిమా అంతా నాగ్ చైర్ లోనే ఉండాల్సి ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని తయారుచేశారు. నాగ్ ఈ తరహా పాత్ర చేస్తుండటంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఆసక్తి నెలకొంది.

నాగ్తో పాటు కార్తీ మరో హీరోగా నటిస్తుండగా తమన్నా కార్తీకి జోడీగా కనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా 60 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించింది. ప్రకాష్ రాజ్, జయసుథ, అలీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి మార్చి 25న రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement