అచ్చంగా అర్జునుడిలా... | Naga Chaitanya's Savyasachi Movie Pre Look Motion Teaser is released today | Sakshi
Sakshi News home page

అచ్చంగా అర్జునుడిలా...

Aug 17 2017 12:37 AM | Updated on Sep 17 2017 5:35 PM

అచ్చంగా అర్జునుడిలా...

అచ్చంగా అర్జునుడిలా...

అర్జునుడు సవ్యసాచి. కురుక్షేత్ర రణరంగంలో ఈ ధీశాలి రెండు చేతులతో శత్రువులపై బాణాలు సంధించాడు.

అర్జునుడు సవ్యసాచి. కురుక్షేత్ర రణరంగంలో ఈ ధీశాలి రెండు చేతులతో శత్రువులపై బాణాలు సంధించాడు. నాగచైతన్య కూడా అచ్చంగా అర్జునుడిలానే. అప్పుడు అర్జునుడు బాణాలు వేయ గలిగితే, ఇప్పుడు చైతూ రెండు చేతులతో శూలాలు వేయగ లుగుతాడు. ఇదంతా సినిమా కోసమేనని ఊహించే ఉంటారు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ‘సవ్యసాచి’ చిత్రంలో చైతూ పవర్‌ఫుల్‌ రోల్‌ చేయనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్‌ లోగోను, ప్రీ–లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ‘‘చందు మొండేటి రాసిన హీరో క్యారెక్టరైజేషన్‌కు ‘సవ్యసాచి’ అనేది యాప్ట్‌ టైటిల్‌. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ‘ప్రేమమ్‌’ తర్వాత నాగచైతన్య, చందు మొండేటిల హిట్‌ కాంబినేషన్‌ ఈ చిత్రంతో రిపీట్‌ అవుతోంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement