
పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలసి స్క్రీన్‌పై తొలిసారి చేసిన ‘మజిలీ’ ముగిసింది. మరి ఈ ప్రయాణంలో ఇద్దరి అలకలు, ప్రేమ ఊసులు, గొడవలు.. ఇవన్నీ తెలియాలంటే ఏప్రిల్ 5 వరకూ ఆగాల్సిందే. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా రూపొందిన చిత్రం ‘మజిలీ’. దివ్యాన్షిక కౌశిక్ మరో కథానాయిక. సాహు గరికపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.
ఇందులో నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగానే నటించారు. రెండు డిఫరెంట్ షేడ్స్‌లో నాగచైతన్య కనిపిస్తారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ‘‘మజిలీ’ ముగిసింది. ఈ సినిమాకు పని చేయడం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఈ కథను మా ద్వారా చెప్పినందుకు థ్యాంక్స్ శివ’’ అని నాగచైతన్య అన్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు శర్మ.