చైతును ‘ఫిదా’ చేస్తారా? | Naga Chaitanya And Sai Pallavi May Act In Sekhar Kammula Direction | Sakshi
Sakshi News home page

చైతును ‘ఫిదా’ చేస్తారా?

Jun 17 2019 3:39 PM | Updated on Jun 17 2019 3:39 PM

Naga Chaitanya And Sai Pallavi May Act In Sekhar Kammula Direction - Sakshi

‘ఫిదా’ చిత్రంతో శేఖర్‌ కమ్ముల మళ్లీ సక్సెస్‌ట్రాక్‌లోకి రాగా, హైబ్రిడ్‌ పిల్ల సాయి పల్లవికి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ వచ్చింది. ఇక ఈ చిత్రంతో సాయి పల్లవి టాలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా సాయి పల్లవికి ఆఫర్లు వస్తున్నాయి.

రీసెంట్‌గా సాయి పల్లవి, రానా కాంబినేషన్‌లో రాబోతోన్న విరాటపర్వం సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. సాయి పల్లవి శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో మరో చిత్రం ఓకే చెప్పినట్లు, ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీలో సాయి పల్లవి నాగచైతన్యను ఎలా ఆటపట్టిస్తుందో చూడాలి. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగ చైతన్య ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement