చై, సామ్‌ మ్యారేజ్‌ ప్రోమో

Naga C0haitanya Samantha Marriage Video By Samantha - Sakshi

టాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ నాగ చైతన్య, సమంతలు గతేడాది వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే. ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరిద్దరు తమ జీవితంలోని ముఖ్యమైన ఘటనల గురించి అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. మిగతా సెలబ్రిటీల మాదిరి వీరి వివాహ వేడుకకు సంబంధించించి ఎటువంటి వీడియోలు బయటకి రాలేదు. వారి పెళ్లి వేడుక ఎలా జరిగిందో చూడాలనే కోరిక అభిమానుల్లో ఉంది. దీంతో సమంత తమ పెళ్లి వేడుకకు సంబంధించిన చిన్నపాటి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. నేను మీకు ప్రామిస్‌ చేసినట్టుగానే.. చై సామ్‌ వివాహ వేడుకలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోలో నాగ చైతన్య..  టై ఎక్కడ అంటూ.. అఖిల్‌ను అడుగుతారు. సమంత వీ కెన్‌ డూ దిస్‌ అంటూ చిన్నగా డ్యాన్స్‌ చేస్తూ కనబడుతారు. పెళ్లిలోని ప్రధాన ఘట్టాలకు సంబంధించిన షార్ట్‌ అండ్‌ స్వీట్‌ విజువల్స్‌ని ఇందులో పొందుపరిచారు. ఈ వీడియో ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన జోసెఫ్‌రాధిక్‌..  సమంత అతన్ని దేశంలోనే బెస్ట్‌గా పేర్కొన్నారు.  ఈ వీడియో చాలా అందంగా ఉంది. మీ ఇద్దరికి దేవుడి దీవెనలు ఉండాలంటూ.. సమంత పోస్ట్‌పై రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కామెంట్‌ చేశారు. అభిమానులు కూడా ఈ వీడియో తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top