నా కంటే మా అమ్మాయిలే తెలివైనవాళ్లు | My daughters far more intelligent than me: Mahesh Bhatt | Sakshi
Sakshi News home page

నా కంటే మా అమ్మాయిలే తెలివైనవాళ్లు

Oct 5 2014 6:06 PM | Updated on Apr 3 2019 6:23 PM

నా కంటే మా అమ్మాయిలే తెలివైనవాళ్లు - Sakshi

నా కంటే మా అమ్మాయిలే తెలివైనవాళ్లు

తన కంటే తన కుమార్తెలే తెలివైనవాళ్లని బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ అన్నారు.

న్యూఢిల్లీ: తన కంటే తన కుమార్తెలే తెలివైనవాళ్లని బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ అన్నారు. ప్రాక్టికల్గా కూడా వాళ్లే బాగుంటారని కితాబిచ్చారు. అమ్మాయిల నుంచి తాను సలహాలు కూడా తీసుకుంటుంటానని మహేష్ భట్ చెప్పారు.

మహేష్ భట్కు పూజా భట్, షహీన్, అలియా భట్ సంతానం. హీరోయిన్గా నటించిన పూజాభట్ ఆ తర్వాత నిర్మాతగా మారారు. షహీన్ రచయిత కాగా, అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్ వర్ధమాన హీరోయిన్. తన కుమార్తెలు ఎవరి సాయం లేకుండా వారివారి రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని మహేష్ భట్ చెప్పారు. తండ్రిగా తాను గర్విస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement