నాపై అలాంటి స్టాంప్ వేసేశారు - తేజ | my all movies compared to jayam movie - teja | Sakshi
Sakshi News home page

నాపై అలాంటి స్టాంప్ వేసేశారు - తేజ

Jul 31 2015 12:59 AM | Updated on Sep 28 2018 4:15 PM

నాపై అలాంటి స్టాంప్ వేసేశారు - తేజ - Sakshi

నాపై అలాంటి స్టాంప్ వేసేశారు - తేజ

‘‘తేజ సినిమా చేయడం మొదలుపెడితే హోరాహోరీగా పోరాడతాడు. అతను పరిచయం చేసే హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు కూడా అంతే హోరాహోరీగా ఉంటారు.

‘‘తేజ సినిమా చేయడం మొదలుపెడితే హోరాహోరీగా పోరాడతాడు. అతను పరిచయం చేసే హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు కూడా అంతే హోరాహోరీగా ఉంటారు. ఈ సినిమాతో పరిచయమవుతున్న దిలీప్ గొప్పగా ఎదుగుతాడని పిస్తోంది’’ అని సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. దిలీప్, దక్ష జంటగా తేజ దర్శకత్వంలో శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ‘హోరాహోరీ’ చిత్రం పాటల వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.
 
 కల్యాణి కోడూరి స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని హీరో సుమంత్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లా డుతూ - ‘‘తేజ ఎప్పుడు ఏ సినిమా డెరైక్ట్ చేసినా పరిశ్రమలోకి కొత్త నీరు వస్తుంది. తేజకు స్టార్స్ అవసరం లేదు. నేను, తేజ రెండేళ్లు రూమ్మేట్స్‌గా ఉన్నాం. తనెప్పుడూ నాకు వండర్‌గానే అనిపిస్తాడు’’ అని చెప్పారు. ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ, ‘‘తేజ తెలివితేటల్లో యాభై శాతం నాకు ఉంటే వంద సినిమాలు డెరైక్ట్ చేసేవాణ్ణి. తేజ ఒక అద్భుతం. నిర్మాత దాము నాకు ఆత్మబంధువు’’ అని చెప్పారు.
 
 ఈ సినిమా ప్రచార చిత్రం చూస్తుంటే ‘జయం’ గుర్తుకొస్తుందని దర్శకుడు వీవీ వినాయక్ పేర్కొన్నారు. తేజ మాట్లాడుతూ, ‘‘నేను ఏ సినిమా తీసినా అందరూ ‘జయం’తో పోలుస్తున్నారు. నేను వేరే తరహా సినిమాలు చేసినా తేజ లవ్‌స్టోరీలే తీస్తాడనే స్టాంప్ వేసేశారు. గత పదేళ్లుగా కాస్త సెలైంట్‌గా ఉన్న నేను మళ్లీ అగ్రెసివ్‌గా మారాను. ఈ సినిమాలో కూడా నా అగ్రెసివ్‌నెస్ కనిపిస్తుంది. లైట్లు, మేకప్ లేకుండా ఈ సినిమా చేశాం. కల్యాణి కోడూరి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు’’ అని చెప్పారు.
 
 దామోదరప్రసాద్ మాట్లాడుతూ - ‘‘కర్ణాటకలో 53 రోజులు షూటింగ్ చేశాం. మా నాన్నగారి స్ఫూర్తితో నా కుటుంబ సభ్యులు, స్నేహితుల అండతో నిర్మాతగా ఎదుగుతున్నాను’’ అని తెలిపారు. తొలి చిత్రాన్నే ఓ టాప్ డెరైక్టర్‌తో చేస్తున్నందుకు హీరో దిలీప్ సంతోషం వెలిబుచ్చారు. ఈ వేడుకలో అచ్చిరెడ్డి, ‘జెమినీ’ కిరణ్, బసిరెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, గోపీచంద్ మలినేని, జీవిత, భీమనేని, నాగశౌర్య, ఆర్పీ పట్నాయక్, ప్రతాని రామకృష్ణ గౌడ్, పెద్దాడ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement