ఎమ్.ఎస్.ధోని మరో రికార్డ్ | Ms Dhoni Biopic New Record | Sakshi
Sakshi News home page

ఎమ్.ఎస్.ధోని మరో రికార్డ్

Sep 27 2016 1:04 PM | Updated on Sep 4 2017 3:14 PM

ఎమ్.ఎస్.ధోని మరో రికార్డ్

ఎమ్.ఎస్.ధోని మరో రికార్డ్

బాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వరుసగా తెరకెక్కుతున్న క్రీడాకారుల బయోపిక్స్ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అదే బాటలో భారత క్రికెట్ కెప్టెన్ ధోని జీవిత కథ ఆధారంగా...

బాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వరుసగా తెరకెక్కుతున్న క్రీడాకారుల బయోపిక్స్ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అదే బాటలో భారత క్రికెట్ కెప్టెన్ ధోని జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎమ్ ఎస్ ధోని అన్టోల్డ్ స్టోరి పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతోంది.

ఇప్పటికే ప్రమోషన్ పరంగా భారీ హైప్ క్రియేట్ చేస్తోన్న ధోని సినిమా, మరో అరుదైన ఘనతను సాధించింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు, మెగాస్టార్లు నటించిన సినిమాలు కూడా ఇప్పటి వరకు 50 దేశాలకు మించి రిలీజ్ కాలేదు. కానీ ఎమ్ ఎస్ ధోని మాత్రం ఏకంగా 60 దేశాల్లో 4500 స్క్రీన్స్లో రిలీజ్ కానుంది. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్గా పేరున్న ధోని బయోపిక్ కోసం అంతర్జాతీయ క్రీడాభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓ సాధారణ టికెట్ కలెక్టర్ ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్గా మారిన క్రమాన్ని సినిమాటిక్గా రూపొందించిన ఈ సినిమాలో, ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కనిపిస్తున్నాడు. ఎ వెడ్నస్ డే, స్పెషల్ చబ్బీస్, బేబి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నీరజ్ పాండే ఎమ్ ఎస్ ధోని చిత్రానికి దర్శకత్వం వహించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement