'బాహుబలి 2' ప్రభంజనం | More than 85 million views online, in 96 hours | Sakshi
Sakshi News home page

'బాహుబలి 2' ప్రభంజనం

Mar 20 2017 10:42 AM | Updated on Sep 5 2017 6:36 AM

'బాహుబలి 2' ప్రభంజనం

'బాహుబలి 2' ప్రభంజనం

ఆన్ లైన్ లో 'బాహుబలి 2' ప్రచారచిత్రం ప్రభంజనం కొనసాగుతోంది.

ఆన్ లైన్ లో 'బాహుబలి 2' ప్రచారచిత్రం ప్రభంజనం కొనసాగుతోంది. అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ట్రైలర్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గురువారం ఉదయం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ప్రచారచిత్రానికి ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు స్పందన వస్తోంది. విడుదల ఆరు గంటల్లోనే కోటి వ్యూస్ సాధించింది. అక్కడితో ఆగకుండా ప్రభంజనం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరో రికార్డు సాధించింది. 96 గంటల్లో 8.5 కోట్లపైగా వ్యూస్ సరికొత్త శిఖరాలను అందుకుంది.

'బాహుబలి 2' ట్రైలర్ కు వస్తున్న స్పందన పట్ల చిత్రయూనిట్ హర్షాతిరేకం వ్యక్తం చేసింది. ప్రచారచిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రధారులుగా నటించిన ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 25 ఆడియో ఫంక్షన్ నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement