వెయ్యి కోట్లు.. రెండు భాగాలు

Mohanlal's Randamoozham to go on floors in July 2019 - Sakshi

వెయ్యి కోట్ల భారీ చిత్రానికి వచ్చే ఏడాది జూలైలో ముహూర్తం కుదిరింది. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో రూపొందనున్న బహు భాషా చిత్రం ‘రన్‌డామూళమ్‌’. జ్ఞానపీuŠ‡ అవార్డు గ్రహీత ఎమ్‌టీ వాసుదేవన్‌ నాయర్‌ నవల ‘రన్‌డామూళమ్‌’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ దర్శకత్వంలో బీఆర్‌ శెట్టి నిర్మించనున్నారు.

ఈ సినిమాకు మలయాళంలో ‘రన్‌డామూళమ్‌’, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో ‘ది మహాభారత’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ‘‘ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. కొందరు ఇండియన్‌ ఫేమస్‌ యాక్టర్స్‌ ఇందులో నటిస్తారు’’ అన్నారు నిర్మాత. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమా తొలి పార్ట్‌ను 2020లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top