మోహన్‌బాబుకు మాతృవియోగం | Mohan Babu Mother Manchu Lakshmamma Passes Away | Sakshi
Sakshi News home page

మోహన్‌బాబుకు మాతృవియోగం

Published Fri, Sep 21 2018 2:36 AM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

Mohan Babu Mother Manchu Lakshmamma Passes Away - Sakshi

ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం కన్ను  మూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం ఉదయం కన్నుమూశారు. లక్ష్మమ్మ భౌతికకాయాన్ని ఎ.రంగంపేట సమీపంలోగల శ్రీ విద్యానికేతన్‌ ప్రాంగణంలోని ఆమె నివాసానికి తరలించారు. విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ మరణవార్త తెలియగానే హుటాహుటిన ఇండియాకి బయలుదేరారు.

‘‘మా నానమ్మ లక్ష్మమ్మగారు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్సవుతాం నానమ్మా. ఈ సమయంలో మేం ఇండియాలో లేకపోవడం బాధ కలిగించింది. ఇది ఊహించని పరిణామం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని ట్వీటర్‌ ద్వారా మంచు మనోజ్‌ పేర్కొన్నారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం తిరుపతిలో జరుగుతాయి. సినీ నటి, ఎమ్మెల్యే రోజా లక్ష్మమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement