breaking news
Manchu Lakshmamma
-
మోహన్‌బాబుకు మాతృవియోగం
ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం కన్ను మూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం ఉదయం కన్నుమూశారు. లక్ష్మమ్మ భౌతికకాయాన్ని ఎ.రంగంపేట సమీపంలోగల శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆమె నివాసానికి తరలించారు. విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ మరణవార్త తెలియగానే హుటాహుటిన ఇండియాకి బయలుదేరారు. ‘‘మా నానమ్మ లక్ష్మమ్మగారు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్సవుతాం నానమ్మా. ఈ సమయంలో మేం ఇండియాలో లేకపోవడం బాధ కలిగించింది. ఇది ఊహించని పరిణామం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని ట్వీటర్ ద్వారా మంచు మనోజ్ పేర్కొన్నారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం తిరుపతిలో జరుగుతాయి. సినీ నటి, ఎమ్మెల్యే రోజా లక్ష్మమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
మోహన్‌బాబు తల్లి లక్ష్మమ్మ కన్నుమూత
-
మోహన్‌బాబు ఇంట్లో విషాదం
సాక్షి, చిత్తూరు: ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఉన్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. ఆమె భౌతికకాయాన్ని తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు తరలించారు. మోహన్ బాబు, ఆయన కుటుంబసభ్యులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. లక్ష్మమ్మ మరణవార్త తెలియగానే వారు హుటాహుటిన స్వదేశానికి బయలుదేరారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు తిరుపతిలో జరగనున్నాయి. ఆమె అంత్యక్రియలకు రాజకీయ, సీని ప్రముఖులు హాజరుకానున్నారు.