ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఉన్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. ఆమె భౌతికకాయాన్ని తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు తరలించారు.