బ్రహ్మీ ఆశీర్వాదంతో... | 'MLA' means 'manchi lakshanaalu vunna abbai' | Sakshi
Sakshi News home page

బ్రహ్మీ ఆశీర్వాదంతో...

Jul 2 2017 11:19 PM | Updated on Oct 30 2018 5:58 PM

బ్రహ్మీ ఆశీర్వాదంతో... - Sakshi

బ్రహ్మీ ఆశీర్వాదంతో...

కొత్త సినిమా షూటింగులో తొలి అడుగు వేశారు కాజల్‌ అగర్వాల్‌.

కొత్త సినిమా షూటింగులో తొలి అడుగు వేశారు కాజల్‌ అగర్వాల్‌. ఈ అడుగుకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... తెలుగు చిత్రసీమలో ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కాజల్‌ తొలి అడుగు వేశారు. అందులో హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌. ఆయనకు జోడీగా మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడు ‘ఎం.ఎల్‌.ఎ.’ అనే సినిమాలో కాజల్‌ నటిస్తున్నారు. ‘ఎం.ఎల్‌.ఎ.’ అంటే ‘మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి’ అని మీనింగ్‌. ఆదివారం నుంచి కాజల్‌ ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ సెల్ఫీ ఫొటో పోస్ట్‌ చేశారు. అందులో ‘హాయ్‌... హలో... నమస్తే! నేను మీ కాజల్‌ అగర్వాల్‌. నా ఫస్ట్‌ హీరోతో ‘ఎం.ఎల్‌.ఎ.’ సెట్‌లో ఫస్ట్‌ డే’ అన్నట్టు పోజిస్తే... బ్రహ్మీ బాబా ఆశీర్వదించారు. ఆయనెవరు అనుకుంటున్నారా? ఫొటోలో కనిపిస్తున్నారు కదా! నవ్వుల బాబా బ్రహ్మానందం, ఆయనే. వీళ్లిద్దరి పోజులు చూసి సెల్ఫీ తీసిన కల్యాణ్‌రామ్‌ నవ్వులు చిందించారు. ఉపేంద్ర మాధవ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను సి. భరత్‌చౌదరి, ఎమ్‌.వి. కిరణ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement