ఇవన్నీ సమాజంలో జరుగుతున్నవే! | Miss Leelavathi release on 3 April | Sakshi
Sakshi News home page

ఇవన్నీ సమాజంలో జరుగుతున్నవే!

Mar 30 2015 11:14 PM | Updated on Sep 2 2017 11:36 PM

ఇవన్నీ సమాజంలో జరుగుతున్నవే!

ఇవన్నీ సమాజంలో జరుగుతున్నవే!

అక్రమ సంబంధాలు మానవ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తాయనే కథాంశంతో దర్శకుడు పి. సునీల్‌కుమార్ రెడ్డి

అక్రమ సంబంధాలు మానవ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తాయనే కథాంశంతో దర్శకుడు పి. సునీల్‌కుమార్ రెడ్డి తీసిన చిత్రం ‘మిస్ లీలావతి’. కార్తీక్, లీలావతి ముఖ్య తారలుగా కీ ప్రొడక్షన్స్, శ్రావ్య ఫిలింస్‌పై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ -‘‘వైజాగ్‌లో పోలీస్‌గా చేస్తున్న నా స్నేహితుడు, ‘అక్రమ సంబంధాల వల్ల ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి... ఆ పాయింట్ మీద సినిమా తీస్తే బాగుంటుంది’ అన్నాడు.
 
 అందుకే ఈ సినిమా చేశా. సమాజంలో జరుగుతున్నవే నా సినిమాల్లో చూపిస్తున్నా. విమర్శలు, ప్రశంసలూ రెండూ వస్తున్నాయి. మంచి సందేశం ఉన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది’’ అన్నారు. అసభ్యతకు తావు లేకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాత చెప్పారు. సునీల్‌కుమార్ రెడ్డి ఏ సినిమా చేసినా మంచి సందేశం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు అన్నారు. పాటలు మాత్రమే కాదు, రీ-రికార్డింగ్ కూడా అద్భుతంగా కుదిరిందని సంగీతదర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి చెప్పారు. ఛాయాగ్రాహకుడు ఎస్.వి. శివరాం, నటులు కార్తీక్, మహేశ్ కూడా మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement