వన్స్‌ మోర్‌

Mehreen Kaur, Gopichand paired again - Sakshi

యాక్షన్‌ మోడ్‌ నుంచి రొమాంటిక్‌ మోడ్‌లోకి మారిపోయారు గోపీచంద్‌. ఇండియా పాకిస్థాన్‌ బోర్డర్‌లో విలన్స్‌తో ఫైటింగ్‌ చేసిన ఆయన ప్రస్తుతం హీరోయిన్స్‌తో డ్యూయెట్స్‌ పాడటానికి సిద్ధమయ్యారు. తిరు దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం తెరకెక్కుతోంది. అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో గూఢచారి (స్పై) పాత్రలో గోపీచంద్‌ నటిస్తున్నారు. స్పైగా పాకిస్థాన్‌ బార్డర్‌లో 45 రోజులు పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆ గూఢచారికి జోడీ కుదిరింది. గోపీచంద్‌ సరసన మెహరీన్‌ హీరోయిన్‌గా నటించనున్నారు.  ‘ఎఫ్‌ 2’ తర్వాత మెహరీన్‌ చేయబోతున్న తెలుగు సినిమా ఇదే. ఆల్రెడీ ‘పంతం’ సినిమాలో గోపీచంద్, మెహరీన్‌ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఈ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ జరీనా ఖాన్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలకానుందట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top