నటి ఇన్నర్‌వేర్‌లతోసహా దోచుకుపోయారు | Meghna Naidu Duped by Tenants explained in Facebook | Sakshi
Sakshi News home page

Feb 23 2018 10:42 AM | Updated on Apr 3 2019 8:58 PM

Meghna Naidu Duped by Tenants explained in Facebook  - Sakshi

నటి మేఘనా నాయుడు (పాత చిత్రం)

సాక్షి, ముంబై : నటి మేఘనా నాయుడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఇంట్లో అద్దెకుంటున్న ఓ జంట ఆమెను దారుణంగా మోసం చేశారు. ఈ క్రమంలో వారు ఆమె సామాన్లతో సహా ఉడాయించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్‌ బుక్‌లో తెలియజేశారు.

వివరాల్లోకి వెళ్లితే.. నటి మేఘనా నాయుడిక గోవాలో ఓ ఇల్లు ఉంది. దానికి ఆమె ఓ గార్డియన్‌ను నియమించి.. ఆమె మాత్రం ముంబైలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ఓ జంట ఆ ఇంట్లో అద్దెకు దిగారు. తాము ముంబైకి చెందిన వారిమని.. న్యూజిలాండ్‌లో పని చేస్తుంటామని... పని మీద గోవాకు వచ్చామని నమ్మబలికారు. అంతేకాదు వారి ఆధార్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను కూడా ఇచ్చారు. 

కానీ, గత కొన్ని నెలలుగా వారు అద్దె చెల్లించలేదంట. అంతేకాదు చెప్పా పెట్టకుండా పారిపోయిన ఆ జంట.. పోతూ పోతూ ఇంట్లోని మేఘనా వస్తువులను కూడా ఎత్తుకెళ్లిపోయారంట. ఇన్నర్‌ వేర్‌లతోపాటు, సాక్సులను కూడా వదలకుండా వారు తీసుకెళ్లినట్లు ఆమె వివరించింది. వారి ఆధార్‌, లైసెన్స్‌లు కూడా నకిలీవని తేలింది. అంతేకాదు గార్డియన్‌ను కూడా బురిడీ కొట్టించి ఆమె కొడుక్కి జాబ్‌ ఇప్పిస్తామని చెప్పించి 85 వేలు వసూలు చేశారంట. ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా అప్పులు చేసినట్లు ఫేస్‌బుక్‌లో నాలుగు రోజుల క్రితం పోస్ట్‌ చేసింది. అయితే ఈ ఘటనపై ఆమె పోలీసులను ఆశ్రయించిందా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

కలియోన్‌ కా చమన్‌ మ్యూజిక్‌ రీమిక్స్‌ ఆల్బమ్‌(2002)తో పాపులర్‌ అయిన మేఘనా.. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో కూడా పృథ్వీ నారాయణ, విక్రమార్కుడు, పాండురంగడు, పిల్ల జమీందార్‌ తదితర చిత్రాల్లో ఆమె కనిపించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement