నా ఓటు ఆమెకే! | Manjima Mohan wants to play Jayalalithaa in her biopic | Sakshi
Sakshi News home page

నా ఓటు ఆమెకే!

Jul 3 2018 1:53 AM | Updated on Jul 3 2018 1:53 AM

Manjima Mohan wants to play Jayalalithaa in her biopic - Sakshi

మంజిమా మోహన్‌

ఫిక్షనల్‌ క్యారెక్టర్స్‌ నుంచి బయోపిక్స్‌లో యాక్ట్‌ చేయాలనే ఉత్సాహం నటీనటుల్లో బాగా పెరిగిపోయింది. అందరికీ ఆ అవకాశం దొరక్కపోయినా ఫలానా వాళ్ల బయోపిక్‌లో యాక్ట్‌ చేయాలనుంది అని బయటకు చెప్తున్నారు కొందరు. ఇప్పటికే కొందరు కథానాయికలు  తమిళనాడు మాజీ సీయం, నటి జయలలిత బయోపిక్‌లో యాక్ట్‌ చేయాలనుందని చెప్పారు.

ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫేమ్‌ మంజిమా మోహన్‌ కూడా జాయిన్‌ అయ్యారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మీరు ఎవరి బయోపిక్‌లో నటించాలనుకుంటున్నారు? అని నాకు ఆప్షన్‌ ఇస్తే.. నా ఓటు జయలలితగారి జీవితానికి. ఆమె చాలా డేరింగ్‌ అండ్‌ బోల్డ్‌ లేడీ. జయలలితగారి ఆ క్వాలిటీస్‌కి నేను పెద్ద అభిమానిని. అందుకే ఆవిడ బయోపిక్‌లో యాక్ట్‌ చేయాలనుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మంజిమ హిందీ  ‘క్వీన్‌’ మలయాళ రీమేక్‌ ‘జామ్‌ జామ్‌’లో యాక్ట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement