అసాధ్యాలను సుసాధ్యం చేసుకోగలం! | Mamta Mohandas In 'To Noor With Love'? | Sakshi
Sakshi News home page

అసాధ్యాలను సుసాధ్యం చేసుకోగలం!

Jan 7 2014 12:49 AM | Updated on Sep 28 2018 4:53 PM

అసాధ్యాలను సుసాధ్యం చేసుకోగలం! - Sakshi

అసాధ్యాలను సుసాధ్యం చేసుకోగలం!

‘‘ఏదీ అసాధ్యం కాదు. ఒకవేళ సుసాధ్యం అని బలంగా ఫిక్స్ అయ్యారనుకోండి.. సాధించడం పెద్ద కష్టమేం కాదు. సంకల్పం ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేసుకోగలం!

 ‘‘ఏదీ అసాధ్యం కాదు. ఒకవేళ సుసాధ్యం అని బలంగా ఫిక్స్ అయ్యారనుకోండి.. సాధించడం పెద్ద కష్టమేం కాదు. సంకల్పం ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేసుకోగలం!  నేను బయటపడిన ప్రతిసారీ ఒకటే అనుకుంటా. ఇంకా కొత్త కొత్తవి సాధించే అవకాశం మనకు దక్కింది అని’’ అన్నారు మమతా మోహన్‌దాస్. ఆత్మవిశ్వాసం లేనివారిలో విశ్వాసం పెంచుతాయి ఆమె మాటలు. మమతాకి కేన్సర్ వ్యాధి సోకిన విషయం తెలి సిందే. 
 
 ఆ వార్త తెలియగానే ఆమె షాక్ అవ్వలేదు. ధైర్యంగా చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత సినిమాలు చేయడం కూడా మొదలుపెట్టారు. కానీ, ఆమె ఆత్మస్థయిర్యానికి పరీక్షలా ఆ మధ్య వ్యాధి తిరగబెట్టింది. ఈసారి కూడా మమతా ధైర్యం కోల్పోలేదు. గత కొన్ని నెలలుగా ఆమె చికిత్స చేయించుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సందర్భంగా ఆమె ఓ సోషల్ నెట్‌వర్క్ తన స్పందనలు తెలిపారు. ప్రస్తుతం మమతా ఓ మలయాళ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ‘టు నూరా విత్ లవ్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి బాబు దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement