సురేష్‌ బాబు చేతుల మీదుగా ‘మళ్ళీ మళ్ళీ చూశా’ టీజర్ | Malli Malli Chusa Teaser Launch By Suresh Babu | Sakshi
Sakshi News home page

Jan 22 2019 11:44 AM | Updated on Jan 22 2019 11:46 AM

Malli Malli Chusa Teaser Launch By Suresh Babu - Sakshi

అనురాగ్ కొణిదెనని హీరోగా పరిచయ చేస్తూ క్రిషి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ‘మళ్ళీ మళ్ళీ చూశా’. సాయిదేవ రామన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కొణిదెన కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర  టీజర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు. 


ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘మళ్ళీ మళ్ళీ చూశా’ టీజర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. కంటెంట్ యూత్ కు బాగా చెరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ కు ఆల్ ది బెస్ట్’ అన్నారు. దర్శకుడు సాయిదేవ రామన్ మాట్లాడుతూ.. ‘సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమకథ చిత్రం మా మళ్ళీ మళ్ళీ చూశా సినిమా’ అన్నారు.

నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. ‘మా సినిమా కంటెంట్ నచ్చి టీజర్ విడుదల చేసిన సురేష్ బాబు గారికి ధన్యవాదాలు‌. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో రిలీజ్ ని చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం.’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement