మోహన్ లాల్కు తప్పిన ప్రమాదం | Malayala superstar mohan lal meets with an accident | Sakshi
Sakshi News home page

మోహన్ లాల్కు తప్పిన ప్రమాదం

Jan 28 2016 12:08 PM | Updated on Sep 3 2017 4:29 PM

మోహన్ లాల్కు తప్పిన ప్రమాదం

మోహన్ లాల్కు తప్పిన ప్రమాదం

మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు కేరళలోని మళయత్తూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. పులిమురుగన్ సినిమా...

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురువారం రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు కేరళలోని మళయత్తూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. పులిమురుగన్ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు వెళుతున్న మోహన్ లాల్ కారు, వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మోహన్ లాల్కు ఎలాంటి గాయాలు కాలేదు.

ప్రస్తుతం మలయాళంలో పులిమురుగన్ సినిమాలో నటిస్తున్న మోహన్ లాల్, తెలుగులోనూ మరో రెండు సినిమాలను అంగీకరించారు. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలోనూ నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement