రెండు ఉన్మత్త ఆత్మలు.. ఒక ప్రేమ.. | Malang Hindi Movie New Poster Out | Sakshi
Sakshi News home page

‘మలంగ్‌’ లేటెస్ట్‌ పోస్టర్‌ విడుదల

Jan 4 2020 2:30 PM | Updated on Jan 4 2020 2:57 PM

Malang Hindi Movie New Poster Out - Sakshi

మలంగ్‌ సినిమా తాజా పోస్టర్‌

సముద్రం ఒడ్డున ఆదిత్య, దిశ గాఢ అదర చుంబనంలో మునిగిపోయినట్టు చిత్రీకరించారు.

ఆదిత్య రాయ్‌ కపూర్‌, దిశా పటానీ జంటగా నటిస్తున్న ‘మలంగ్‌’ లేటెస్ట్‌ పోస్టర్‌ హీట్‌ పెంచుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఆదిత్య, దిశ, అనిల్‌ కపూర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో సముద్రం ఒడ్డున ఆదిత్య, దిశ గాఢ చుంబనంలో మునిగిపోయినట్టు చిత్రీకరించారు. ఈ పోస్టర్‌ను దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి.. ‘రెండు ఉన్మత్త ఆత్మలు.. ఒక ప్రేమ.. మలంగ్‌’ అని క్యాప్షన్‌ పెట్టారు. ఈ సినిమా ట్రైలర్‌ జనవరి 6న విడుదలకానుంది.

రాజ్‌, కలియుగ్‌, ఏక్‌ విలన్‌, ఆష్‌కీ 2 తదితర సినిమాలకు దర్శకత్వం వహించిన మొహిత్‌ సూరి ఈ సినిమా తెరకెక్కించారు. క్రైమ్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ‘మలాంగ్‌’  సినిమాలో కీలకమైన ఓ ముద్దు సన్నివేశం కోసం హీరోహీరోయిన్లు రెండు రోజులు శిక్షణ తీసుకున్నారట. కునాల్‌ ఖేము, అమృత ఖాన్విల్కర్‌, ఏంజెలా క్రిస్లింజ్కి, షాద్‌ రాంధ్వా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 7న ‘మలంగ్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement