అండర్‌వాటర్‌లో ఆ పిక్స్‌ ఎవరు తీశారు!?

Malaika stuns in swimsuit pic posted on Instagram - Sakshi

బాలీవుడ్‌ నటి, ఫ్యాషన్‌ క్వీన్‌ మలైకా అరోరా రెగ్యులర్‌గా తన లేటెస్ట్‌ ఫొటోలు ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె టు పీస్‌ రెడ్‌ బికినీ ధరించి అండర్‌వాటర్‌లో స్విమ్‌ చేస్తున్న ఫొటోలను షేర్‌ చేశారు. ‘  స్థిరంగా, ప్రశాంతంగా మెడిటేషన్‌ చేస్తూ’ అంటూ పెట్టిన ఈ ఫొటోలకు మంచి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రెండు లక్షల 50 వేలమందికి పైగా ఈ ఫొటోలను లైక్‌ చేశారు. బాలీవుడ్‌ దర్శకురాలు ఫరా ఖాన్‌ సహా పలువురు నెటిజన్లు ఈ ఫొటోలు ఎవరు తీశారంటూ ఆరా తీశారు. మరికొందరేమో ఇంకెవరు అర్జున్‌ కపూరేనంటూ కామెంట్‌ చేశారు. ‘అర్జున్‌ కపూర్‌ నువ్‌ చాలా అద్భుతంగా ఫొటో తీశావ్‌.. ఫొటో క్రెడిట్‌ అర్జున్‌దే’ నంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.

భర్త అర్భాజ్‌ ఖాన్‌ నుంచి విడాకులు తీసుకున్న మలైకా అరోరా ప్రస్తుతం తన కన్నా చిన్నవాడైన అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌ చేస్తున్నట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట తరచూ డిన్నర్‌, లాంచ్‌లకు కలిసి వెళ్తూ ఫొటోలకు ద‍ర్శనమివ్వడంతో బాలీవుడ్‌ హాట్‌ కపుల్‌గా మారిపోయారు. వీరు పెళ్లి కూడా చేసుకుంటారని కథనాలు వచ్చాయి కానీ.. ఇద్దరూ ఆ కథనాలను తోసిపుచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top