చయ్య చయ్య.. చిత్రీకరణలో కష్టాలయ్యా

షారుక్ ఖాన్ ‘దిల్ సే’లో ‘చయ్య చయ్య చయ్య చల్ చయ్య చయ్య..’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ట్రైన్ సాంగ్స్‌లో ఓ బెస్ట్ సాంగ్‌గా ఆ పాట ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో పరిగెడుతూనే ఉంది. ఈ పాటకు షారుక్‌తో కలసి బాలీవుడ్ భామ మలైకా అరోరా స్టెప్పులేశారు. ఇటీవలే ఈ సూపర్‌హిట్ సాంగ్ మేకింగ్ వెనక జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను షేర్ చేసుకున్నారు. ‘‘కదిలే ట్రైన్ మీద నిలబడి ఈ పాటకు డ్యాన్స్ చేస్తుంటాను. అది అందరికీ తెలిసిందే. ట్రైన్ కదలికలకు ఒక్కోసారి కిందపడిపోయేదాన్ని.
దాంతో మా టీమ్ నేను వేసుకున్న గాగ్రా మీదగా నా నడుము చుట్టూ ఓ తాడుతో నన్ను ట్రైన్‌కి కట్టేశారు. అలా అయితే నేను కిందపడను కదా. తాడు కట్టాక చిత్రీకరణ సవ్యంగా జరిగింది. కానీ పాట పూర్తయ్యాక ఆ తాడు తీసేసినప్పుడు నా నడుము మొత్తం గీసుకుపోయి రక్తంతో నిండిపోయింది. దాంతో సెట్లో అందరూ కంగారుపడిపోయారు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు మలైకా అరోరా. స్క్రీన్ మీద కనువిందు చేయడానికి స్క్రీన్ వెనక స్టార్స్ ఇలాంటి కష్టాలు పడుతుంటారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి