పల్లెటూరి అమ్మాయి.. దేశం గర్వపడేస్థాయి!

mahila kabaddi movie audio sucess meet - Sakshi

రచన స్మిత్‌ ప్రధాన పాత్రలో ఆర్‌కే ఫిలింస్‌ పతాకంపై రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘మహిళా కబడ్డి’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ మూడు పాటలకు పది లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఆడియో సక్సెస్‌మీట్‌లో నిర్మాత ముత్యాల రాందాస్‌ మాట్లాడుతూ –‘‘రామకృష్ణగౌడ్‌గారు స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం సక్సెస్‌ కావాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్‌లో చాలాకాలం తర్వాత నేను దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రమిది.

మహిళలు ఎందులో తక్కువకాదనే కాన్సెప్ట్‌ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఒక పల్లెటూరి అమ్మాయి దేశం గర్వపడేస్థాయి కబడ్డీ ఛాంపియన్‌గా ఎలా ఎదిగింది అన్నదే కథాంశం. మధుప్రియ, మంగ్లీ, గీతామాధురి పాడిన పాటలకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. మరో రెండు పాటలను మధుప్రియ, గీతా మాధురితో పాడించి త్వరలోనే విడుదల చేస్తాం. ఈ సినిమాతో రాజ్‌కిరణ్‌కు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మంచి బ్రేక్‌ వస్తుంది. షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది’’ అన్నారు రామకృష్ణగౌడ్‌ . ఈ సినిమాకు కెమెరా: రాజు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top