సంక్రాంతికి చిన్నోడు | Mahesh Launching His New Film | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి చిన్నోడు

May 22 2017 11:55 PM | Updated on May 10 2018 12:13 PM

సంక్రాంతికి చిన్నోడు - Sakshi

సంక్రాంతికి చిన్నోడు

చిన్నోడు మళ్లీ సంక్రాంతికి వస్తున్నాడు.

చిన్నోడు మళ్లీ సంక్రాంతికి వస్తున్నాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో చిన్నోడిగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్‌ అందుకున్నారు మహేశ్‌బాబు. ఇప్పుడు మళ్లీ సంక్రాంతి పండగకు రావడానికి రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌ చేస్తున్న తాజా సినిమా ‘భరత్‌ అనే నేను’ను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.‘శ్రీమంతుడు’ హిట్‌ తర్వాత మహేశ్, కొరటాల కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత.

సోమవారం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం మహేశ్‌బాబు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘స్పైడర్‌’ షూటింగ్‌ నిమిత్తం చెన్నైలో ఉన్నారు. మహేశ్‌ లేకుండానే కొరటాల షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. త్వరలో ‘భరత్‌ అనే నేను’ టీమ్‌తో మహేశ్‌ జాయిన్‌ అవుతారట! ఆల్రెడీ ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్‌ ఎప్పుడో ట్యూన్స్‌ (పాటలు) సిద్ధం చేసేశారు. వచ్చే ఏడాది జనవరి 11న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement