‘నా రియల్‌ హీరో.. నా మెంటర్‌’ | Mahesh Babu Tweet On The Occasion Of His Father Krishna Birth Day | Sakshi
Sakshi News home page

May 31 2018 3:29 PM | Updated on Oct 22 2018 6:10 PM

Mahesh Babu Tweet On The Occasion Of His Father Krishna Birth Day - Sakshi

నేడు సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్‌స్టార్‌​ బర్త్‌డే సందర్భంగా సుధీర్‌ బాబు సమ్మోహనం ట్రైలర్‌ను కృష్ణ చేతుల మీదుగా రిలీజ్‌చేయించారు. కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ఉదయాన్నే విషెస్‌ తెలిపి, తండ్రితో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌లో ఉన్నారు. 

కొద్ది క్షణాల క్రితమే మహేష్‌ తన తండ్రికి బర్త్‌డ్‌ విషెస్‌ చెబుతూ...  ‘  నా రియల్‌ హీరో.. నా మెంటర్‌.. నా ఆలోచన... నా బలం.. ప్రతీది నువ్వే. నీ కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉంది. హ్యాపి బర్త్‌డే నాన్న. ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ సుపర్‌స్టార్‌ మీరే’  అంటూ ట్వీట్‌ చేశాడు. మహేష్‌ తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్‌ గడ్డం, మీసంతో కొత్త లుక్‌ను ట్రై చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement