ఫ్యాన్స్కి మహేష్ బర్త్ డే గిఫ్ట్..? | Mahesh Babu Spyder release date locked | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్కి మహేష్ బర్త్ డే గిఫ్ట్..?

Apr 26 2017 3:13 PM | Updated on Sep 5 2017 9:46 AM

ఫ్యాన్స్కి మహేష్ బర్త్ డే గిఫ్ట్..?

ఫ్యాన్స్కి మహేష్ బర్త్ డే గిఫ్ట్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఏడాది తన పుట్టిన రోజు అభిమానులకు భారీ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడు. మహేస్ ప్రస్తుతం తమిళ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఏడాది తన పుట్టిన రోజు అభిమానులకు భారీ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడు. మహేస్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ముందుగా జూన్ 23న రిలీజ్ చేయాలని భావించారు.

అయితే ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావేమో అన్న ఆలోచనతో చిత్రయూనిట్ సినిమా విడుదల వాయిదా వేశారు. ఇంత వరకు అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా.. మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఆగస్టు 9న స్పైడర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్లోనూ అదే రోజు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో ఎస్ జె సూర్య విలన్గా అలరించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement