రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్‌ బృందం..  | Mahesh Babu Sarileru Neekevvaru Team At Renigunta Airport | Sakshi
Sakshi News home page

రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్‌ బృందం.. 

Jan 16 2020 9:56 PM | Updated on Jan 16 2020 9:59 PM

Mahesh Babu Sarileru Neekevvaru Team At Renigunta Airport - Sakshi

సరిలేరు నీకెవ్వరు చిత్రం విజయవంతం కావడంతో చిత్రబృందం మంచి జోష్‌లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు చిత్ర బృందం గురువారం తిరుమల వెళ్లింది. హైదరాబాద్‌ నుంచి రేణిగుంట విమానశ్రయం చేరుకున్న చిత్రబృందంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

అక్కడి నుంచి వారు రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు. తిరుమల వెళ్లినవారిలో మహేశ్‌ బాబు, నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడి, రాజేంద్రప్రసాద్‌, అనిల్‌ సుంకర, వంశీ పైడిపల్లి ఉన్నారు.  రేపు వేకువజామున సరిలేరు నీకెవ్వరు చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement